ఇది సరిపోదమ్మా….జోరు పెంచాల్సిందే ఇక!! | 123Josh.com
Home న్యూస్ ఇది సరిపోదమ్మా….జోరు పెంచాల్సిందే ఇక!!

ఇది సరిపోదమ్మా….జోరు పెంచాల్సిందే ఇక!!

0
508

నాని కున్న ఇమేజ్ కి మార్కెట్ కి సరిగ్గా పబ్లిసిటీ చేస్తే అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయి. కానీ నిర్మాతలు ఈ వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. ఎంత మౌత్ టాక్ మీద ఆధారపడ్డ కంటెంట్ అయినప్పటికీ అది బయటికి రావాలన్నా మొదటి రెండు మూడు రోజులు సాధారణ పబ్లిక్ సపోర్ట్ అవసరం. వాళ్ళు ముందుగా సినిమా చూడాలంటె ఆ స్థాయిలో ఆసక్తి కలిగేలా ఏదైనా ప్రమోషన్ ప్లాన్ చేయాలి.

ఇదే సంస్థ రెండు నెలల క్రితం రిలీజ్ చేసిన డియర్ కామ్రేడ్ టైంలో ఎంత హడావిడి చేసారో ఇంకా గుర్తే. నాలుగు రాష్ట్రాలు చుట్టేసి మ్యూజికల్ ఈవెంట్స్ పేరుతో మాములు రచ్చ చేయలేదు. ఫస్ట్ వీకెండ్ కామ్రేడ్ మంచి వసూళ్లు తెచ్చుకోవడానికి హెల్ప్ అయ్యింది ఇదే. పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కథ ఇంకోలా ఉండేది కానీ కామ్రేడ్ ఫైనల్ గా నిరాశనే మిగిల్చాడు. కానీ గ్యాంగ్ లీడర్ విషయంలో అలాంటి జోష్ ఏమి కనిపించడం లేదు.

నాని కెరీర్ మొత్తంలో ఇంత లో హైప్ తో విడుదలవుతున్న మూవీ ఇదేనని ట్రేడ్ సైతం అభిప్రాయపడుతోంది. విక్రమ్ కుమార్ ఎంచుకున్న డిఫరెంట్ కాన్సెప్ట్ కార్తికేయ విలనీ లేడీ గ్యాంగ్ ఎలిమెంట్ వీటిలో దేనినీ గ్యాంగ్ లీడర్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here