ప్రభాస్ దెబ్బకి అందరి ర్యాంకులు మారిపోయాయి!! | 123Josh.com
Home న్యూస్ ప్రభాస్ దెబ్బకి అందరి ర్యాంకులు మారిపోయాయి!!

ప్రభాస్ దెబ్బకి అందరి ర్యాంకులు మారిపోయాయి!!

0
1510

రికార్డులు ఎప్పుడూ శాశ్వతం కాదు.  నిన్నటి రికార్డు ఈరోజు బద్దలవుతుంది.. లేకపోతే రేపు బద్దలవుతుంది.  అయితే కొన్ని రికార్డులు మాత్రం చాలా కాలం పాటు అలానే కొనసాగుతాయి.  బాహుబలి 2 రికార్డులు అలాంటివే.  బాహుబలి 2 సాధించిన బాక్స్ ఆఫీస్ రికార్డులు అనన్యసామాన్యమైనవి. 

తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు తీసుకుంటే అది కూడా బాహుబలి 2 పేరిటే ఉంది.  ఇక టాప్ ఫైవ్ లిస్టులో ‘బాహుబలి 2’ తర్వాత ‘అరవింద సమేత’ (26.6 కోట్లు).. ‘అజ్ఞాతవాసి’ (26.36 కోట్లు).. ‘వినయ విధేయ రామ’ (26.03 కోట్లు) మహర్షి (24.18 కోట్లు) సినిమాలు ఉండేవి. 

తాజాగా ప్రభాస్ ‘సాహో’ ఈ లిస్టులో రెండవ స్థానం సాధించింది.  ‘సాహో’ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ రూ.36 కోట్లు. దీంతో రెండవ స్థానంలో ఉన్న ‘అరవింద సమేత’ ను మూడవ స్థానానికి నెట్టి రెండవ స్థానంలో నిలిచింది.  ఇక ఈ లిస్టులో ఐదవ స్థానంలో ఉన్న ‘మహర్షి’ ఆరవ స్థానానికి పడిపోయింది.  దీంతో మహేష్ బాబు చిత్రం టాప్ 5 లిస్టులో స్థానం కోల్పోయింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here