సాహో తో దెబ్బ తిన్న వారికే సైరా!!…ఏం జరుగుతుందో మరి!! | 123Josh.com
Home గుసగుసలు సాహో తో దెబ్బ తిన్న వారికే సైరా!!…ఏం జరుగుతుందో మరి!!

సాహో తో దెబ్బ తిన్న వారికే సైరా!!…ఏం జరుగుతుందో మరి!!

0
630

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’ మరో ఇరవై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  సహజంగా మెగాస్టార్ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ సినిమా రిలీజ్ డేట్ కు చాలా ముందుగానే క్లోజ్ అవుతుంది.  అయితే ‘సైరా’ కు మాత్రం కాస్త డిలే అయింది.  అందులోనూ ఓవర్సీస్ రైట్స్ విషయంలో ఇంకా ఎక్కువ సమయం పట్టింది.  దీనికి రెండు కారణాలు.. ఒకటి – ఓవర్సీస్ లో ఈమధ్య ఎక్కువ నష్టాలు వస్తున్నాయి.

రెండోది – ‘సైరా’ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో భారీ రేట్లు కోట్ చేయడం జరిగిందని.. అందుకే డీల్ క్లోజ్ అయ్యేందుకు ఎక్కువసమయం పట్టిందని అంటున్నారు.’సైరా’ ఓవర్సీస్ హక్కులను రూ. 15  కోట్లకు ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ చేజిక్కించుకుందని సమాచారం. ఈ సంస్థ రీసెంట్ గా ప్రభాస్ సినిమా

‘సాహో’ ను కూడా ఓవర్సీస్ లో పంపిణీ చేసింది.  గత రెండు మూడు రోజులుగా ఈ డీల్ ఎంతకు క్లోజ్ అయిందనే విషయంపై మీడియాలో కొన్ని వార్తలు వినిపించినా అవన్నీ జస్ట్ స్పెక్యులేషన్లు మాత్రమేని అంటున్నారు.  ఈ డీల్ రికార్డ్ ప్రైస్ అని చెప్పలేం కానీ మెగాస్టార్ మార్కెట్ రేంజ్ కు తగినదేనని చెప్పాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here