10 తో 40 కోట్లు…మహానుభావుడు టోటల్ కలెక్షన్స్ రికార్డ్

  చిన్న సినిమాలను పండగలకు రిలీజ్ చేసి మంచి టాక్ తెచ్చుకుంటే అల్టిమేట్ విజయాలను అందుకోవడం లేటెస్ట్ ట్రెండ్… ఈ విషయాన్ని అందరికన్నా ముందే ఎక్స్ ప్రెస్ రాజా తో గమనించిన యంగ్ హీరో శర్వానంద్ వరుసగా తన సినిమాలను పండగలను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. రీసెంట్ గా దసరా బరిలో మహానుభావుడు తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమా కేవలం 10 కోట్ల లోపే బడ్జెట్ తో తెరకెక్కగా టోటల్ గా సినిమా 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. కాగా సినిమా టోటల్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.

దాంతో మొత్తం మీద సినిమా 21.5 కోట్ల షేర్ ని 40 కోట్ల గ్రాస్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ని మించి సూపర్ హిట్ గా మిగిలిపోయింది ఈ సినిమా. వరుసగా మూడోసారి పండగకి తన సినిమాను రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టేశాడు శర్వానంద్…

Leave a Comment