దశాబ్దం తర్వాత నికార్సయిన హిట్ కొట్టిన డైరెక్టర్…మామూలు హిట్ కాదు బాబోయ్

కొందరు డైరెక్టర్స్ చేసేది తక్కువ సినిమాలే అయినా వాటి ఇంపాక్ట్ మాత్రం ఏళ్ల తరబడి ఉంటుంది…అలాంటి డైరెక్టర్స్ కోవలోకే వస్తాడు క్లాస్ సినిమాల డైరెక్టర్ శేఖర్ కమ్ముల…ఈ మధ్యకాలంలో అందరు తనని మరిచిపోతున్నారు అనుకుంటున్న సమయంలో ఫిదాతో అందరినీ ఫిదా చేశాడు శేఖర్.

కాగా ఈ సినిమా విజయంతో ఊపు మీదున్న శేఖర్ కి గత విజయానికి ఈ విజయానికి అందుకోవడానికి ఏకంగా 10 ఏళ్ల సమయం పట్టింది…2007 లో హ్యాప్పీడేస్ తో చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల తర్వాత లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక సినిమాలు చేశాడు.

కానీ అవేవి హ్యాప్పీడేస్ రేంజ్ హిట్ ని సొంతం చేసుకోలేదు…కానీ ఇప్పుడొచ్చిన ఫిదా మాత్రం ఎవ్వరూ ఊహించని విజయంతో దశాబ్దం తర్వాత శేఖర్ కమ్ములకి నికార్సయిన హిట్ ఇచ్చింది. శేఖర్ కమ్ముల నుండి ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుందాం.

Leave a Comment