118 ప్రొడ్యూసర్ చేతిలో క్రేజీ హీరో ప్రాజెక్ట్…దీపావళి కి ఆ సినిమా తో పోటి!! | 123Josh.com
Home గుసగుసలు 118 ప్రొడ్యూసర్ చేతిలో క్రేజీ హీరో ప్రాజెక్ట్…దీపావళి కి ఆ సినిమా తో పోటి!!

118 ప్రొడ్యూసర్ చేతిలో క్రేజీ హీరో ప్రాజెక్ట్…దీపావళి కి ఆ సినిమా తో పోటి!!

0
483

ఇలయదళపతి విజయ్ కి తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పాల్సిన పనేలేదు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఉన్నంత ఇమేజ్ తమిళంలో అతడికి ఉంది. అయినా ఏం లాభం?  కేవలం ఆ రాష్ట్రం వరకే అతడి పాపులారిటీ పరిమితమైంది. విజయ్ చాలా కాలంగా తెలుగు మార్కెట్ ని కొల్లగొట్టాలని చూసినా ఎందుకనో ఆ రేస్ లో మాత్రం నెగ్గుకు రాలేకపోయాడు. రజనీకాంత్- కమల్ హాసన్- అజిత్ లాంటి స్టార్లకు వచ్చినంత పాపులారిటీ అతడికి రాలేదన్నది వాస్తవం.

విజయ్ నటించిన `తుపాకి` తమిళంలో బ్లాక్ బస్టర్. కానీ తెలుగులో ఆశించినంత ఆడలేదు. మంచి సినిమా అన్నారు కానీ జనాలు చూడలేదు. ఇక రాజా రాణి ఫేం అట్లీతో కలిసి విజయ్ రెండు సినిమాలు చేశాడు ఇప్పటికే. మెర్సల్ – అదిరింది పేరుతో.. తేరి చిత్రం పోలీస్ పేరుతో తెలుగులో రిలీజయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మెర్సల్ కమర్షియల్ గా ఎంతో బావుందని టాక్ వచ్చినా జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయారన్న ముచ్చట సాగింది ట్రేడ్ లో.

అయితే విజయ్- అట్లీ కాంబినేషన్ లేటెస్ట్ మూవీ `బిగిల్` ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కుల్ని 118 నిర్మాత ఛేజిక్కించుకున్నారు. తమిళంలో ఏజీయస్ అధినేత కల్పాతి అఘోరామ్ నిర్మించారు. తెలుగులోకి అనువదించి టైటిల్ ని నిర్ణయించి.. దీపావళికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అదే టైం కి మల్టీ స్టారర్ వెంకీ మామ రిలీజ్ కానుంది మరి!!….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here