14 రోజులు—61 కోట్లు…107 కోట్లు…ఇదీ అసలు లెక్క

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు ఎంతటి హైప్ నడుమ రిలీజ్ అయ్యిందో మహేష్ ని మురగదాస్ ఎలా చూపిస్తాడో అని ఎదురు చూసిన అభిమానులకు మురగదాస్ దిమ్మతిరిగే షాక్ ఇస్తూ ఓ సాదాసీదా కథతో ఎలాంటి హీరోయిజం లేకుండా స్పైడర్ ని ప్రేక్షకులముందుకు తీసుకురాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పడుతూ లేస్తూ 2 వారాలను పూర్తి చేసుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు వారాల్లో 31.70 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా తమిళ్ వర్షన్ కలెక్షన్స్ 10 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. ఇక కర్ణాటక ఓవర్సీస్…ఇతర ప్రాంతాల్లో కలిపి 20 కోట్ల మేర షేర్ ని కలెక్ట్ చేసింది.

మొత్తం మీద 2 వారాల్లో 61.40 కోట్ల షేర్ ని అందుకున్న స్పైడర్ సినిమా టోటల్ గా 107 కోట్ల గ్రాస్ ని 14 రోజుల్లో అందుకుంది. ఇంకా సేఫ్ అవ్వడానికి సినిమా 64.6 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా లాంగ్ రన్ లో మరెంత దూరం వెళుతుందో అని ఇప్పుడు అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Leave a Comment