#ఎన్టీఆర్28 దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్…150 రోజుల వెయిటింగ్ ఇది

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో సినిమా కోసం టోటల్ టాలీవుడ్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా ఎప్పుడెప్పుడు వీరి కలయికలో సినిమా మొదలు అవుతుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ అక్టోబర్ లో వీరి కలయికలో సినిమా మొదలు అయ్యే అవకాశం ఉందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చినా ఇప్పుడు అది కష్టమే అంటున్నారు.

దానికి కారణం పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా అని అంటున్నారు. ఈ సినిమా వల్ల ఎన్టీఆర్ తో మొదలయ్యే సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. పవన్ త్రివిక్రమ్ ల సినిమా సంక్రాంతి కి వస్తుండటంతో….

ఎన్టీఆర్ తో సినిమాను 2018 ఫిబ్రవరిలో మొదలు పెట్టె ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడట…ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కోసం సుమారు 150 రోజులు ఎదురుచూడాల్సిందే అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూపులు ఇప్పటి నుండే మొదలు అయ్యాయి…మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Comment