150 కోట్లకు తగ్గేది లేదు…జైలవకుశ ట్రైలర్ పై మీరేమంటారు??

0
3202

టాలీవుడ్ తలైవా మూడు వరుస హిట్ల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సంచలన మూడు పాత్రల నట విశ్వరూపం జైలవకుశ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులముందుకు వచ్చేసింది…ఇప్పటి వరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు అనిపించేలా మెప్పించిన ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ పీక్స్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ ని ఇలా మూడు పాత్రల్లో చూడటం అభిమానులకు కన్నుల పండగేనని చెప్పాలి.

ఇక అందులో విలన్ రోల్ కూడా ఉండటం మరింత భీభత్సం అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ లో ముగ్గురు ఎన్టీఆర్ లను కలిసి చూసినప్పుడు వచ్చే గూస్ బంప్స్ థియేటర్ లో పూనకాలు ఖాయమని అని చెప్పొచ్చు.

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీగా బాబీ తెరకెక్కించిన జైలవకుశ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మామూలు రచ్చ చేయదు అంటూ ఇండస్ట్రీ లో ఇప్పటి నుండే చెప్పుకుంటున్నారు…మీరు ట్రైలర్ ని చూసి ఎంజాయ్ చేయండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here