15 కోట్లతో మొదటి రోజు బాలయ్య భీభత్సం..కెరీర్ బిగ్గెస్ట్

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అద్బుతమైన వసూళ్ళ తో దుమ్ము లేపింది. బాలయ్య కెరీర్ లో గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. బాలయ్య కెరీర్ లో ఇది కమర్షియల్ మూవీస్ పరంగా రికార్డ్ లెవల్ కలెక్షన్స్ అనే చెప్పాలి అని అంటున్నారు ట్రేడ్ పండి తులు.

మొదటి రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.2 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు రెస్ట్ ఆఫ్ వరల్డ్ మొత్తం కలిపి మరో 2 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా షేర్ 8.2 కోట్లని టచ్ చేసింది.

దాంతో మొదటిరోజు టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 15 కోట్లకు చేరి బాలయ్య కెరీర్ లో కమర్షియల్ మూవీస్ లో ఇదో రికార్డ్ గా నిలిచి సంచలనం సృష్టించింది. రెండోరోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే రికార్డులు సృష్టించే చాన్స్ ఉంది…మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Comment