15 కోట్ల టార్గెట్ ఫస్ట్ వీక్ వచ్చింది ఇది…షాక్ లో గోపీచంద్!! | 123Josh.com
Home న్యూస్ 15 కోట్ల టార్గెట్ ఫస్ట్ వీక్ వచ్చింది ఇది…షాక్ లో గోపీచంద్!!

15 కోట్ల టార్గెట్ ఫస్ట్ వీక్ వచ్చింది ఇది…షాక్ లో గోపీచంద్!!

0
1640

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 25 వ సినిమా పంతం రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అన్న టాక్ ని సొంతం చేసుకుని మొదటి వీకెండ్ వరకు మంచి వసూళ్ళనే సాధించినా తర్వాత మాత్రం చేతులెత్తేసింది. ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్స్ ని సాధించి షాక్ ఇచ్చింది.

మొదటి వీకెండ్ మొత్తం మీద 6.77 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్ మొత్తం మీద 85 లక్షల షేర్ ని మాత్రమె రాబట్టగలిగింది. దాంతో మొత్తం మీద సినిమా మొదటి వారం కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర 7.6 కోట్ల మార్క్ ని అందుకున్నాయి.

సినిమాను మొత్తం మీద 14 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ గా మొదటి వారం 7.6 కోట్ల షేర్ ని మాత్రమె వెనక్కి తేవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇక కష్టమే అని తేలింది…దాంతో గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీ గా పంతం సినిమా నిలిచిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here