ఏకంగా 16 గంటలు ప్రపంచాన్ని ఊపేసిన పవన్ కళ్యాణ్

0
280

ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు నిలిచే హీరో అని చెప్పొచ్చు..హిట్లు ఫ్లాఫ్స్ కి అతీతంగా తనకి తానె సాటిగా అద్బుతమైన కలెక్షన్స్ తో తనకి ఎదురు లేదని నిరూపించు కుంటూ దూసుకు పోతున్న పవర్ స్టార్ పుట్టిన రోజున మెగా అభిమానులు అందరు తమదైన అభిమానం తో సంచలన రికార్డులు నమోదు చేస్తూ పవన్ కి పుట్టిన రోజు గిఫ్ట్ ఇచ్చారు.

ఏకంగా 16 గంటలకు పైగా వరల్డ్ వైడ్ గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు  హాష్ టాగ్ తో భీభత్సం సృష్టిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా టాప్ 5 ప్లేస్ లో ట్రెండ్ చేస్తూ భీభత్సం సృష్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ భీభత్సం సృష్టిస్తున్న అభిమానుల కోసం తన 25 వ సినిమా ప్రీ లుక్ ని రివీల్ చేసి సందడి చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నని అనౌన్స్ చేసి మరింత ఆనందాన్ని కలిగించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here