రిలీజ్ అయిన 17 వ రోజు 2 కోట్ల షేర్…చరిత్రలో తొలిసారి!!

0
294

  ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పాజిటివ్ టాక్ అయినా ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో వారం రెండు వారాల్లో ఆల్ మోస్ట్ డౌన్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. కానీ కొన్ని సినిమాలు మాత్రమె ఊహకందని షాక్ ఇస్తాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం సినిమా ఇదే కోవలోకి వచ్చే సినిమా అని సినిమా బాక్స్ ఆఫీస్ పరుగు ను చూస్తె అర్ధం అవుతుంది.

రిలీజ్ అయిన రెండు వారాల్లో 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న రంగస్థలం సినిమా మూడో వీకెండ్ లో ఆదివారం రోజున దిమ్మతిరిగే గ్రోత్ ని సాధించి సంచలన కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రోజుని దిగ్విజయంగా ముగించింది అని చెప్పొచ్చు.

ఇంకా అఫీషియల్ లెక్కలు రాలేదు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 వ రోజున అవలీలగా 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించింది అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది నిజంగానే సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పాలి. ఎంత పాజిటివ్ టాక్ ఉన్నా ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here