18-28…తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి…మెగా పవర్!!

0
420

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం మార్చి 30 న రిలీజ్ అయినప్పటి నుండి తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డుల వర్షాన్ని రెండో రోజు నుండే సాధిస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. నటుడిగా రామ్ చరణ్ కి తిరుగులేని పేరు ప్రతిష్టలను తీసుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అల్టిమేట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తుంది.

సినిమా నైజాం ఏరియా కి గాను ఏకంగా 28 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి సిరీస్ తర్వాత ఈ మార్క్ ని అందుకున్న ఏకైక సినిమా గా ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా ని అక్కడ మొత్తం మీద 18 కోట్లకు అమ్మారు.

కానీ సినిమా ఇప్పుడు ఏకంగా 28 కోట్ల షేర్ ని తీసుకు వచ్చి అల్టిమేట్ రికార్డ్ లెవల్ లో 10 కోట్ల లాభాన్ని ఒక్క ఏరియాలోనే సాధించి చరిత్ర సృష్టించింది. ఇది నిజంగానే హిస్టారికల్ రికార్డ్ అని చెప్పాలి. ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరెంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here