180 కోట్లు…105 కోట్లు…ఇదేమి అరాచకం సామి!!

0
336

  తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించిన సినిమాగా రంగస్థలం సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పొచ్చు. రిలీజ్ కి ముందు నుండి అంచనాలు ఉన్నా కానీ ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే రేంజ్ లో అంచనాలు ఉన్నాయని ఎవ్వరూ ఊహించలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో రుజువు చేసిన రంగస్థలం సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

రెండు వారాల్లో 100 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా మూడో వీకెండ్ మొత్తం మీద 6 కోట్ల వరకు షేర్ ని అందుకుని సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో టాలీవుడ్ చరిత్రలో 17 రోజుల్లో నాన్ బాహుబలి రికార్డు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

106 కోట్ల షేర్ ని 180 కోట్ల వరకు గ్రాస్ ని అందుకున్న రంగస్థలం సినిమా సృష్టించిన రికార్డులు చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో 110 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here