అక్షరాలా 18 కోట్లు…ఏ సినిమా దరిదాపుల్లోకి కూడా లేదు!!

0
367

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర వీర లెవల్ భీభత్సం సృష్టిస్తూనే ఉంది. కనివినీ ఎరగని రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అంతే కాకుండా నటుడిగా కొద్దిగా విమర్శలు ఎదుర్కొన్న రామ్ చరణ్ కి నటన పరంగా 10మెట్లు ఒకేసారి ఎక్కేలా చేసింది.

ఇలాంటి సినిమా రిలీజ్ కి ముందు మంచి పేరు తెచ్చుకుంటే చాలని కలెక్షన్స్ బోయపాటి తో చేసే సినిమా తో సాధించవచ్చని చాలా మంది అనుకున్నారు. కానీ రంగస్థలం ఊహకందని విజయాన్ని అందుకుని అన్ని ఏరియాల్లో భీభత్సం సృష్టించి షాక్ ఇచ్చింది.

ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో డౌట్ అని రిలీజ్ కి ముందు అనుకున్నా 12 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసి షాక్ ఇచ్చినా టోటల్ గా ఇప్పటి వరకు ఏకంగా 18 కోట్ల షేర్ ని అక్కడ అందుకుని ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేసింది. నాన్ బాహుబలి మూవీస్ లో అక్కడ ఆల్ టైం రికార్డ్ లెవల్ బెంచ్ మార్క్ ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here