2 రోజుల్లో 20 కోట్లు….మాస్ రాజా కుమ్మేశాడు

  మాస్ మహారాజ్ రవితేజ కంబ్యాక్ మూవీ రాజా ది గ్రేట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో దుమ్ము లేపుతుంది. మొదటి రోజు సినిమా కలెక్షన్స్ కొద్దిగా అనుకున్న రేంజ్ లో లేకున్నా సినిమా టాక్ యునానిమస్ పాజిటివ్ టాక్ ఉండటం తో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిన రాజా ది గ్రేట్ మొత్తం మీద అల్టిమేట్ వసూళ్లు సాధించి ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తుంది.

నైజాంలో 3.81 కోట్లు, సీడెడ్ లో 1.6 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రా ఏరియాలలో కలిపి 4 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద 2.2 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది ఈ సినిమా.

మొత్తం మీద 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 11.6 కోట్ల షేర్ ని 20 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక మూడో రోజు కూడా సినిమా అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో రోజు ముగిసే సమయానికి తెలియనుంది.

Leave a Comment