2 రోజుల్లో 21 కోట్లు…బాగానే ఉంది కానీ…ఇదే దెబ్బ

నటసింహం నందమూరి బాలక్రిష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజులను పూర్తి చేసుకుంది…మొదటి రోజు భీభత్సం సృష్టించినా రెండో రోజు మిగిలిన సినిమాల మాదిరిగానే స్లో అయింది…కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే మొదటి రోజు అనుకున్న కలెక్షన్స్ కన్నా ఎక్కువ రాగా రెండోరోజు అనుకున్న దానికన్నా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో అందరూ కొద్ది గా షాక్ లో ఉన్నారని చెప్పొచ్చు. 

కాగా మొదటిరోజు మొత్తంగా 8.53 కోట్ల షేర్ మరియు 14.77 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన ఈ సినిమా రెండోరోజు మొత్తం మీద 4.02 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది…అందులో 3.88 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. కాగా రెండోరోజు మొత్తం గ్రాస్ 6.3 కోట్లకు చేరింది.

దాంతో మొత్తంమీద రెండు రోజుల్లో 21 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన ఈ సినిమా మూడో రోజు స్ట్రాంగ్ గా ఉంటేనే మంచి వీకెండ్ కలెక్షన్స్ ని సాధించగలదు…మరి ఎం జరుగుతుందో చూడాలి.

Leave a Comment