2 వ రోజే జవాన్ కి షాక్ ||లోకల్ బస్ లో పైరసీ…||

0
290

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తో రన్ అవుతున్న విషయం తెలిసిందే… సాయి ధరం తేజ్ కెరీర్ లో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలుస్తు దూసుకు పోతున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే 6.5 కోట్ల దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతుండగా సినిమా కి రెండో రోజు నుండే పైరసీ భూతం పట్టి పీదిస్తుందని సమాచారం.

అది ఎంతలా పాకింది అంటే ఏకంగా లోకల్ బస్సులో సినిమాను టెలికాస్ట్ చేస్తున్నారట…ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు బి వి ఎస్ రవి మీడియా ప్రెస్ మీట్ లో ఈ పనులు చేస్తున్న వాళ్ళని ఓ రేంజ్ లో విమర్శించారు. కాగా రీసెంట్ గా తెలుగు సినిమాలన్నీ౦టికీ ఈ పైరసీ తీవ్రంగా నష్టాలను మిగిలిస్తున్న విషయం తెలిసిందే..

ఈ పద్దతి మారాలి అని…పైరసీ ని ఎంకరేజ్ చేయకుండా వాటిని అరికట్టే మరిన్ని చర్యలు తీసుకోవాలని ఈ డైరెక్టర్ కోరాడు. ఇక జవాన్ వీకెండ్ తర్వాత ఎంత వరకు కలెక్షన్స్ లో స్టడీగా ఉంటుంది అనే దానిపై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here