280 కోట్లు….ఎన్టీఆర్ రికార్డ్ చరిత్రలో నిలిచిపోతుంది

0
3017

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో దూసుకు వెళ్ళగా 79 కోట్లకు పైగా షేర్ తో ఎన్టీఆర్ కెరీర్ లో సెకెండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ వరుసగా రెండు సార్లు 79 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టిన ఓకే ఒక్క తెలుగు హీరో గా సంచలన రికార్డు ను ఎన్టీఆర్ పేరిట లిఖించింది ఈ సినిమా.

కాగా ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ మరియు జైలవకుశ సినిమాల టోటల్ గ్రాస్ ఇప్పుడు మొత్తంగా 280 కోట్ల మార్క్ ని దాటి అల్టిమేట్ రికార్డు నమోదు చేసింది… జనతాగ్యారేజ్ టోటల్ రన్ లో 85 కోట్ల షేర్ ని 140 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది.

కాగా ఇప్పుడు జైలవకుశ సినిమా 79 కోట్ల షేర్ తో 140 కోట్ల వరకు గ్రాస్ ని వసూల్ చేయగా రెండు సినిమాల టోటల్ గ్రాస్ 280 కోట్ల మార్క్ ని దాటగా త్వరలోనే 285 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయం అంటున్నారు. వరుసగా రెండు సినిమాలతో ఇలాంటి రికార్డ్ బాహుబలి ని పక్కకు పెడితే ఎ హీరో కి కూడా లేదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here