బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్…ఈనెల 28 న??

  నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై సింహా టీసర్ మరియు ట్రైలర్ లు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మాస్ ఆడియన్స్ దగ్గర మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను సొంతం చేసుకుని సినిమాపై అంచనాల ను మరింతగా పెంచేలా చేసింది… బాలయ్య కెరీర్ లో 102 వ సినిమా గా తెరకెక్కుతున్న జై సింహా సినిమా సంక్రాంతి కి భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న విషయం అందరి కీ తెలిసిందే….

కాగా సినిమా సెన్సార్ పనులను జరుపుకునే డేట్ ఆల్ మోస్ట్ ఫైనల్ అయినట్లు సమాచారం… 28 న అంటే రేపు సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకోబోతున్నట్లు సమాచారం… ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య పలు గెటప్స్ లో కనిపించబోతున్నారు.

బాలయ్య సరసన నయనతార మరియు హరిప్రియలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోలివుడ్ సీనియర్ డైరెక్టర్ కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్ చేస్తున్నాడు. సెన్సార్ పనులను పూర్తి చేసుకుని రిలీజ్ విషయం లో ఎలాంటి అడ్డంకులు లేకుండా జనవరి 12 న అత్యంత భారీ గా సినిమా రిలీజ్ కానుండటంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూడటం మొదలు పెట్టారు.

Leave a Comment