#NTR29 పై ఇండస్ట్రీలో సంచలన వార్తలు…ఫైనల్ ఎవరో??

  మూడు వరుస విజయా ల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ నటుడిగా ఎన్టీఆర్ కి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకు రాగా… మరోపక్క ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ కోసం అభిమానులు ఎంతో ఆతృత గా ఎదురు చూస్తున్నారు. ఒకటికి మించిన సినిమా ఒకటిని సెలెక్ట్ చేసు కుంటూ ఎన్టీఆర్ సూపర్ లైనప్ ని సిద్ధం చేయగా ఫ్యాన్స్ ముందు గా ఏది ఫైనల్ అవు తుందా అని ఎదురు చూస్తున్నారు.

కాగా ఎన్టీఆర్ 28 వ సినిమాను త్రివిక్రమ్ తో చేస్తుండగా 29 వ సినిమాకి రేసులో చాలామందే ఉన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్ లాంటి క్రేజీ డైరెక్టర్స్ సిద్దంగా ఉంటడంతో ఆ అవాకాశం ఎవరికి దక్కుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

అభిమానుల కోరిక మాత్రం ఎస్.ఎస్.రాజమౌళి అని చెప్పొచ్చు…మరి ఎన్టీఆర్ 29 ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ప్రస్తుతం జైలవకుశ సినిమా తర్వాత చేయబోతున్న త్రివిక్రమ్ సినిమా కోసం తనని తానూ పూర్తిగా మార్చుకోబోతున్న ఎన్టీఆర్ ఆ సినిమాలో సరికొత్త లుక్ తో అలరించనున్నాడట.

Leave a Comment