రెండో రోజు పైసావసూల్ బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఊహకందని విధంగా కలెక్షన్స్ వర్షం కురిపించి అనుకున్న దాని కన్నా కూడా భారీ వసూళ్ళని సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది…మొదట అనుకున్న మొత్తం 6.5 కోట్ల షేర్ అవ్వగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన పైసా వసూల్ ఏకంగా 7.8 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకుని సంచలనం సృష్టించింది.

ఇక టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 8.53 కోట్లని చేరి సంచలనం సృష్టించగా ఇప్పుడు రెండోరోజు కూడా స్ట్రాంగ్ గా ఓపెన్ అయిన పైసా వసూల్ మరోసారి భీభత్సం సృష్టించే విధంగా అడుగులు వేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వసూళ్లు 4 కోట్లకు పైగానే ఉండే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా బి సి సెంటర్స్ లో ఫుల్ స్ట్రాంగ్ గా ఉండగా ఏ సెంటర్స్ లో జోరు తగ్గింది. అది జరగకుంటే కలెక్షన్స్ మరింతగా జోరు చూపేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి అఫీషియల్ లెక్కలు ఎలా ఆన్నాయో చూడాలి.

Leave a Comment