దంచికొట్టిన CM భరత్…3 రోజుల్లో రికార్డులు చెల్లాచెదురు!!

0
614

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు ఫ్లాఫ్ మూవీస్ తర్వాత అల్టిమేట్ కంబ్యాక్ ని భరత్ అనే నేను సినిమా తో సొంతం చేసుకున్నాడు. అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా రెండు రాష్ట్రాలలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో కుమ్మేస్తుంది. కాగా సినిమా తమిళనాడులో మూడు రోజులకు గాను రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని సాధించి చరిత్ర సృష్టించి షాక్ ఇచ్చింది.

మొదటి రోజు 77 లక్షలు, రెండో రోజు 76 లక్షలు మూడో రోజు 80 లక్షల రేంజ్ లో సినిమా గ్రాస్ వసూల్ చేసినట్లు సమాచారం…దాంతో సినిమా మూడు రోజుల్లోనే తమిళ్ లో 2.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక చెన్నై ఏరియా లోనే సినిమా మూడు రోజుల్లో 81 లక్షల వరకు గ్రాస్ ని అందుకోవడం ఇక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ రెండు రికార్డుల విషయం లో ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసిన భరత్ అనే నేను సినిమా మిగిలిన ఏరియాల్లో కూడా ఓ రేంజ్ లో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ దూసుకు పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here