3 రోజుల్లో 74 కోట్లు…ఇదీ అజ్ఞాతవాసి కలెక్షన్స్ !!

0
636

   టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు చరిత్ర సృష్టించగా రెండో రోజు నుండి అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించడం లో విఫలం అవ్వగా మొత్తం మీద సినిమా 125 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మూడు రోజులో సాధించిన కలెక్షన్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు. ఓవరాల్ గా 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూల్ చేయాల్సిన అవసరమ్ ఉందని అంటున్నారు.

కాగా మొత్తం మీద సినిమా మొదటి రోజు 39.3 కోట్లు…రెండో రోజు 3.7 కోట్లు కలెక్ట్ చేసి 90% డ్రాప్స్ ని సొంతం చేసుకోగా మూడో రోజు పుంజుకుంటుంది అనుకున్నా మళ్ళీ షాక్ ఇచ్చిన అజ్ఞాతవాసి మూడో రోజు మొత్తం మీద 2.2 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసింది.

దాంతో మొత్తం మీద మూడు రోజుల్లో 45.2 కోట్ల షేర్ మార్క్ ని సినిమా అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పుడు 74 కోట్ల మార్క్ ని అధిగమించింది…కానీ సినిమా సాధించాల్సిన మొత్తం కొండంత ఉండగా ఇప్పుడు సినిమా ఎంతవరకు సంక్రాంతి సెలవుల్లో పుంజుకుంటుంది అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here