మూడు నెలల్లో 3….దిల్ రాజు దిమ్మతిరిగే షాక్!!

0
503

గత ఏడాది టాలీవుడ్లో దిల్ రాజు జోరు మామూలుగా లేదు. ‘శతమానం భవతి’.. ‘నేను లోకల్’.. ‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకున్నాడీ స్టార్ ప్రొడ్యూసర్. ‘రాజా ది గ్రేట్’.. ‘ఎంసీఏ’ సైతం మంచి వసూళ్లే సాధించాయి. ఏకంగా ఆరు సినిమాల రిలీజ్తో సంచలనం సృష్టించాడు రాజు. ఈ ఏడాది కూడా ఆ ఊపును కొనసాగిస్తూ కనీసం అరడజను రిలీజ్లు ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు రాజు. ఐతే ఐదు నెలల వరకు ఆయన ఒక్క సినిమాతోనూ పలకరించలేదు. కానీ జులై నెల నుంచి వరుసగా మూడు మాసాల్లో మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రాజు ఫిక్సయ్యాడు.


ముందుగా ఆయన బేనర్ నుంచి ‘లవర్’ సినిమా రాబోతోంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. ఈ చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆ తర్వాత నితిన్-సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ వస్తుంది. ఈ చిత్రం ఆగస్టు 15కు షెడ్యూల్ అయి ఉంది. ఆ తర్వాతి నెలలో రామ్ సినిమా ‘హలో గురు ప్రేమ కోసమే..’ రాబోతోంది. నితిన్ సినిమా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది.

త్వరలోనే ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయనున్నారు. రామ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నిన్ననే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకు దిల్ రాజు సొంత సినిమాతో పలకరించకపోయినా.. చాలా సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు. అవి ఆయనకు చాలా వరకు నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో సొంత సినిమాలతో మళ్లీ ట్రాక్  లో పడాలని రాజు చూస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here