3 వ రోజు భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
534

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ని అందుకుందని ట్రేడ్ వర్గాలు అనౌన్స్ చేయడంతో సినిమా అల్టిమేట్ రికార్డులను అందుకుందని చెప్పొచ్చు. కాగా ఇప్పుడు మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన భరత్ అనే నేను భారీ కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తుంది.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి కొద్దిగా ఆక్యుపెన్సీ ఎండల వలన ఎఫెక్ట్ చూపినా ఈవినింగ్ షోల కి ఐపిఎల్ మ్యాచులు కొద్దిగా అడ్డుగా నిలిచినా కానీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది అనే చెప్పాలి. సినిమా రెండు రాష్ట్రాల్లో సూపర్బ్ గా హోల్డ్ చేసింది.

రోజు ముగిసే సరికి సినిమా అవలీలగా 8 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి అంటే సినిమా ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. మరి సినిమా నైట్ షోల రిపోర్ట్స్ ఇలాగే ఉంటె రచ్చ మరింత పెరుగుతుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here