4 మిలియన్ వ్యూస్…ఇండస్ట్రీ రికార్డ్ వైపు జైలవకుశ

0
3186

టాలీవుడ్ తలైవా యూట్యూబ్ రికార్డుల రారాజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ అఫీషియల్ ట్రైలర్ యూట్యూబ్ లో స్వైరవిహారం చేస్తూ దూసుకుపోతుంది… కాగా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఆడియో సక్సెస్ మీట్ జరగడంతో వ్యూస్ మండగించగా ట్రైలర్ కూడా లవ మరియు కుశ బాటలో స్లో అవుతుందేమో నని చాలామంది అనుకున్నారు కానీ జైలవకుశ ట్రైలర్ మాత్రం వీర లెవల్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది.

కాగా యూట్యూబ్ లో ఇప్పటికే 4 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసిన జైలవకుశ ట్రైలర్ తొలి 24 గంటల్లో సంచలన రికార్డులు నమోదు చేసే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది..ఇప్పటికే ట్రైలర్ కి 1 లక్షా 50 వేల లైక్స్ వచ్చాయి.

మరి 24 గంటలు ముగిసే సమయానికి ఈ రికార్డుల జోరు ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇక సినిమా సెప్టెంబర్ 21 న అత్యంత భారీ ఎత్తున ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. అప్పుడు రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here