4 సినిమాల శాటిలైట్ రైట్స్ 400 కోట్లు…టోటల్ ఇండియా షాక్!!

0
747

  బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్.. మార్కెట్ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఫ్లాప్ సినిమాలతో కూడా వందల కోట్ల వసూళ్లు రాబట్టగల సత్తా అతడి సొంతం. సల్మాన్ సినిమాలంటే ట్రేడ్ వర్గాల్లో సూపర్ క్రేజ్ ఉంటుంది. సల్మాన్ చివరి సినిమా ‘టైగర్ జిందా హై’ శాటిలైట్ హక్కులు ఏకంగా రూ.70 కోట్లు పలకడం విశేషం. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ విషయంలో ఇండియాలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు సల్మాన్.

ఈ సూపర్ స్టార్ తర్వాతి నాలుగు సినిమాలను కలిపి శాటిలైట్ హక్కులు రూ.400 కోట్లు పలికినట్లు సమాచారం. ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ శాటిలైట్ డీల్. సగటున ఒక్కో సినిమాకు రూ.100 కోట్లంటే మాటలు కాదు. అమీర్ ఖాన్ సినిమాలకు సైతం ఈ రేటు పలకలేదు. జీ టీవీ గ్రూప్ ఇటీవలే ఈ డీల్ పూర్తి చేసిందట. సల్మాన్.. అతడి నిర్మాతలకు  మధ్య అవగాహన మేరకు ఈ ఒప్పందం జరిగింది.

ఇంతకుముందు హృతిక్ రోషన్ నాలుగు సినిమాలకు కలిపి రూ.300 కోట్ల శాటిలైట్ ఒప్పందం జరిగింది. దాన్ని ఇప్పుడు సల్మాన్ భారీ తేడాతో అధిగమించాడు. ప్రస్తుతం సల్మాన్ ‘రేస్-3’ చిత్రంలో నటిస్తున్నాడు. అది రంజాన్ పండక్కి రిలీజవుతుంది. దాని తర్వాత ‘భరత్’.. ‘కిక్-2’ సినిమాలు కమిటయ్యాడు. ఇంకో సినిమా ఏదో కూడా ఇంకా ఖరారవ్వలేదు. అయినప్పటికీ ముందే శాటిలైట్ డీల్ పూర్తి చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here