44 వ రోజు రంగస్థలం కలెక్షన్స్…టాలీవుడ్ చరిత్రకెక్కాయి!!

2
434

సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా రామ్ చరణ్ విశ్వరూపం చూపించిన రంగస్థలం నాన్ బాహుబలి రికార్డ్స్ ని సైతం కొట్టేసింది అంటే ఏదో మొదటి మూడు వారాల ప్రభావం అనుకున్నారు కాని వసూళ్ళ ప్రభంజనం మాత్రం ఇంకా తగ్గలేదు అన్నది నిజం. ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయేలా వీక్ ఎండ్ లో వస్తున్న కలెక్షన్ చూసి వాళ్ళు సైతం నోరెళ్ళబెడుతున్నారు. అర్థ శతదినోత్సవానికి దగ్గరలో ఉన్న రంగస్థలం ఈ రోజు నుంచి ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ వెబ్ సైట్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వస్తోందని తెలిసినా కూడా టికెట్లు తెగుతునే ఉన్నాయి.

44 వ రోజు ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఉన్న మెయిన్ థియేటర్ సుదర్శన్ 70 ఎంఎంలో నాలుగు ఆటలకు గాను మొత్తం 2 లక్షల 98 వేలు రావడం చూసి మెగా ఫాన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఒక్క ఫస్ట్ షోనే 1 లక్షా 18 వేల 128 రూపాయలు ఇచ్చింది. అంటే మొత్తం హౌస్ ఫుల్ అయితే తప్ప ఇంత రావడానికి ఆస్కారం ఉండదు.

సినిమా విడుదలైన రెండు మూడు వారాలకే లైఫ్ అయిపోతున్న తరుణంలో 44వ రోజు ఈ రేంజ్ లో రాబట్టడం ఒక వింతయితే దీని తర్వాత చాలా గ్యాప్ తో వచ్చిన కొత్త సినిమాల ఆదివారం కలెక్షన్ రంగస్థలం కంటే తక్కువగా ఉండటం మరో ట్విస్ట్.

మౌత్ పబ్లిసిటీతో హోరెత్తిపోతున్న మహానటి శాంతి థియేటర్లో 3 లక్షల 3 వేలు సంధ్య 70 ఎంఎంలో ఉన్న నా పేరు సూర్య 2 లక్షల 48 వేలు – సంధ్య 35 ఎంఎంలో ఉన్న భరత్ అనే నేను 2 లక్షల 19 వేలు రాబట్టాయి. ఇందులో ఒక్క మహానటి మాత్రమే రంగస్థలం కంటే జస్ట్ 5 వేలు ఎక్కువ తెచ్చుకుంటే మిగిలినవన్నీ చాలా దూరంలో ఉండిపోయాయి.

పూరి తనయుడి మెహబూబా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సండే అయినప్పటికీ దేవి 70 ఎంఎం లాంటి థియేటర్లో సైతం లక్ష కూడా రాబట్టలేకపోయింది.98 వేల దగ్గర ఆగిపోయింది. నిజంగా రంగస్థలంది చరిత్రలో గుర్తుండిపోయే ప్రత్యేకమైన విజయం. ట్రేడ్ కూడా ఇప్పుడున్న ట్రెండ్ లో ఒక సినిమా 50 రోజులకు దగ్గరలో హౌస్ ఫుల్ కావడం అనేది చాలా కాలం తర్వాత చూసామని చెప్పడం విని మెగా ఫాన్స్ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here