4 వ రోజు భరత్ అనే నేను ఎంత కలెక్ట్ చేయాచ్చో తెలుసా??

0
413

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల వీకెండ్ లో రెండు రాష్ట్రాల్లో 38.3 కోట్ల దాకా షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 59 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 98 కోట్ల వరకు ఉందని సమాచారం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు తొలి మండే వర్కింగ్ టెస్ట్ ను ఎదురుకుంది.

కాగా సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి కొద్ది వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఎండలు భారీ దెబ్బ కొట్టింది అని చెప్పొచ్చు. కానీ ఈవినింగ్ షోల కి ఓ రేంజ్ లో గ్రోత్ ని సాధించింది సినిమా. అదే రోజు మొత్తం కొనసాగితే సినిమా…

అవలీలగా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మండే టెస్ట్ లో ఇది అద్బుతమైన కలెక్షన్స్ అనే చెప్పాలి. మరి సినిమా టోటల్ గా 4 వ రోజు ఎంత వరకు కలెక్షన్స్ ని రాబడుతుందో నిర్మాతలు ఎంత అనౌన్స్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here