5 రోజుల్లో 29 కోట్లు…ఊచకోత కి పరాకాష్ట ఇది!!

0
243

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు లేకున్నా అంచనాలను అందుకుంటే బాగుండు అన్న ఆశతో బరిలోకి దిగిన మాహనటి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూళ్ళతో భీభత్సం సృష్టించింది. ఓవర్సీస్ మార్కెట్ లో పెను సంచలనం సృష్టిస్తూ ఈ సినిమా మొదటి 5 రోజుల వీకెండ్ లో అక్కడ ఏకంగా 1.6 మిలియన్ మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసి షాక్ ఇచ్చింది ఈ సినిమా.

తక్కువ సెంటర్స్ లో రిలీజ్ అవ్వడం వలన షేర్ ఎక్కువగా వచ్చింది ఈ సినిమా కి… 6.6 కోట్ల షేర్ ని ఓవర్సీస్ లో సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్ లో 7.8 కోట్ల షేర్ ని సాధించి సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది.

ఇక తమిళ్ లో 90 లక్షలకు పైగాను, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.8 కోట్ల వరకు షేర్ ని అందుకున్న ఈ సినిమా మొత్తం మీద మొదటి 5 రోజుల్లో 16.2 కోట్ల వరకు షేర్ ని 29 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సినిమా బిజినెస్ 20 కోట్ల రేంజ్ లోనే ఉండటంతో మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ కి చేరువ కానుంది ఈ ఎపిక్ మూవీ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here