50 ఇన్ 137…చిట్టిబాబు రాంపేజ్…ఫ్యాన్స్ కి పూనకాలే!!

1
380

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 7 వారాలను ముగించుకుంది. కాగా సినిమా టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే, రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా 50 రోజుల వేడుక విషయం లో కూడా దుమ్ము లేపింది.

రెండు రాష్ట్రాలలో మొత్తం మీద 81 డైరెక్ట్ సెంటర్స్ లో సినిమా 50 రోజుల వేడుకని ముగించుకోగా సినిమా మరో 44 సెంటర్స్ లో షిఫ్ట్ ల పద్దతి మీద ఓవరాల్ గా 50 రోజుల వేడుకని జరుపుకుందని సమాచారం, ఇక సినిమా మల్టీప్లెక్సులలో సుమారు….

9 థియేటర్స్ లో 50 రోజులు డైరెక్ట్ గా ఆడగా ఓవర్సీస్ లో 3 లోకేషన్స్ లో 50 రోజులు ఆడి రికార్డ్ కొట్టింది. దాంతో ఓవరాల్ గా సినిమా 137 సెంటర్స్ లో 50 రోజుల వేడుకని జరుపుకుని ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసి టోటల్ రన్ 125 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here