50000000…అల్లుఅర్జున్ చరిత్ర సృష్టించాడు…రికార్డు కొట్టే ధీరుడు ఎవరు ?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కి ఇక్కడ ఎంత ఫాలోయింగ్ ఉందో సౌత్ లో మిగిలిన రాష్ట్రాల్లో నార్త్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా అక్కడ అల్లుఅర్జున్ నటించిన సినిమాలకు అద్బుతమైన టి.ఆర్.పి రేటింగ్ లు రావడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక యూట్యూబ్ లో అప్లోడ్ అయిన అల్లుఅర్జున్ డబ్బింగ్ సినిమాలకు అక్కడ ఆల్ టైం హిస్టారికల్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. రీసెంట్ గా అక్కడ డబ్ అయ్యి టెలికాస్ట్ అయిన అల్లుఅర్జున్ సరైనోడు సినిమా ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ ని అందుకున్న సినిమాగా చరిత్రకెక్కింది.

దాదాపు ఇప్పటివరకు 5 కోట్ల 50 లక్షలకు పైగా వ్యూస్ ని క్రాస్ చేసి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి నాన్ హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది..ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతున్న ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు కొట్టడం ఖాయం అంటున్నారు. మరి ఈ రికార్డులను బ్రేక్ చేసే హీరో ఎవరు అవుతారో చూడాలి…

Leave a Comment