6 రోజుల్లో 35 కోట్లు…షాక్ ల మీద షాక్ ఇస్తున్న పైసావసూల్

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ లేక ఎదురీదుతుంది. మొదటి రోజు అద్బుతమైన వసూళ్లు సాధించిన ఈ సినిమా తర్వాత మాత్రం అనుకున్న రేంజ్ కలెక్షన్స్ లేక రోజు రోజుకి కలెక్షన్స్ తగ్గుతూ 6 వ రోజు సినిమా క్లియర్ ఫేట్ ఏంటో అందరికీ తెలిసే లా కలెక్షన్స్ ని సాధించి అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఈ సినిమా.

5 రోజుల్లో 17.77 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా 6 వ రోజు టోటల్ గా 23 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 6 రోజులకు గాను 18 కోట్లకు చేరుకుంది…కాగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని క్రాస్ చేయడానికి మరో 15.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది.

ఇక టోటల్ గ్రాస్ 35 కోట్లు కాగా బాలయ్య కెరీర్ లో ఇది ఆల్ టైం టాప్ 5 ఓపెనింగ్స్ లో చోటు దక్కించుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల నడుమ ఇది సరిపోవు అని చెప్పొచ్చు. మరి సెకెండ్ వీకెండ్ లో అయిన ఏమైనా గ్రోత్ ఉంటుందా లేదా చూడాలి.

Leave a Comment