అక్షరాలా 600 షోలు…పవర్ స్టార్ క్రేజ్ పవర్ ఇది

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా సంక్రాంతి కానుకగా అత్యంత భారీ ఎత్తున రాబోతున్న విషయం తెలిసిందే… పవర్ స్టార్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈ సినిమాపై స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ రాగా అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి.

ఇక సినిమా రిలీజ్ కి ముందే అత్యంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుండ గా సినిమా కి రిలీజ్ రోజు ముందే అత్యధిక ప్రీమియర్ షోలు ఏర్పాటు చేయ బోతున్నారనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడు తున్నాయి. ఇవి పెయిడ్ ప్రీమియర్ షోలు అవ్వడం తో మరింత జోరు అందు కుంది.

సుమారు 600 పెయిడ్ ప్రీమియర్ షోలు జనవరి 9 సాయంత్రం 6 నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ ఎత్తున పడ బోతున్నా యని అంటున్నారు. అంటే ఈ షోల కలెక్షన్స్ తో కలిపి మొదటి రోజు వసూళ్ళలో అల్టిమేట్ రికార్డులు పక్కా అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment