7-80 కోట్లు ఇదీ ఎన్టీఆర్ టార్గెట్…పులికేక పెట్టిస్తాడు అంటున్న ఫ్యాన్స్

0
933

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ జైలవకుశ సినిమా లో ఎన్టీఆర్ మూడు డిఫెరెంట్ రోల్స్ లో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే…భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఈ దసరా కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

కాగా సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 7 రోజుల్లో ఎలాంటి పోటి లేకపోవడంతో కచ్చితంగా ఓపెనింగ్స్ నుంచే అద్బుతమైన రికార్డులు నెలకొల్పే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కానీ మినిమమ్ లో మినిమమ్ ఎంతవరకు మొదటి 7 రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టే చాన్స్ ఉండనే చర్చ జరుగుతుంది.

ట్రేడ్ వర్గాలు మాత్రం టాక్ కి అతీతంగా సినిమాపై ఉన్న క్రేజ్ దృశ్యా మొదటి 7 రోజుల్లో కనీసం 80 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం చాలా సులభమే నని తెల్చేస్తున్నాయి. ఎన్టీఆర్ కి ఇప్పుడున్న క్రేజ్ దృశ్యా అంతకుమించి కలెక్ట్ చేసినా ఆశ్యర్యపోనవసరం లేదని చెబుతుండటంతో ఈ సినిమా భీభత్సం మాములుగా ఉండదని అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here