7 వ సినిమాతో చరిత్ర సృష్టించిన తెలుగు హీరోలు వీరే! | 123Josh.com
Home న్యూస్ 7 వ సినిమాతో చరిత్ర సృష్టించిన తెలుగు హీరోలు వీరే!

7 వ సినిమాతో చరిత్ర సృష్టించిన తెలుగు హీరోలు వీరే!

0
2913

టాలీవుడ్ హీరోలకు సెంటిమెంట్స్ ఎక్కువ..మరీ ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్ లో ప్రతీ సినిమా ముఖ్యమే కానీ 7 వ సినిమా మరింత స్పెషల్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న స్టార్ హీరోల 7 వ సినిమాలలో కొన్ని సంచలనం సృష్టించాయి. ఒకసారి అవి పరిశీలిస్తే…

ముందుగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో 7 వ సినిమా అయిన ఖుషీ అల్టిమేట్ విజయంతో దుమ్ము లేపింది, తర్వాత మహేష్ బాబు ఒక్కడు సినిమాతో 7 వ సినిమాను అత్యంత ఘనంగా ముగించి రికార్డులకెక్కాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో సింహ ఘర్జన చేశాడు.

ఈ ముగ్గురు హీరోల 7 వ సినిమాలో భూమికే హీరోయిన్ కావడం మరో విచిత్రం. వీళ్ళకి కలిసి వచ్చినంతగా మిగిలిన హీరోలకు 7 వ సినిమా అంతగా కలిసి రాలేదు. అల్లుఅర్జున్ ఆర్య 2 తో ఫ్లాఫ్ కొట్టాడు, ప్రభాస్ 7 వ పౌర్ణమితో ఫ్లాఫ్ కొట్టగా, నాగచైతన్య ఆటోనగర్ సూర్యతో ఫ్లాఫ్ కొట్టాడు. కానీ రామ్ చరణ్ ఎవడు సినిమాతో 7 వ సినిమాను హిట్ తో ముగించాడు. ఇలా కొందరికి 7 వ సినిమా కలిసి రాగా కొందరికి మాత్రం పెద్దగా కలిసి రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here