పెట్టిన డబ్బుకి డబుల్ ప్రాఫిట్…అభిమన్యుడు టోటల్ కలెక్షన్స్!! | 123Josh.com
Home న్యూస్ పెట్టిన డబ్బుకి డబుల్ ప్రాఫిట్…అభిమన్యుడు టోటల్ కలెక్షన్స్!!

పెట్టిన డబ్బుకి డబుల్ ప్రాఫిట్…అభిమన్యుడు టోటల్ కలెక్షన్స్!!

0
1305

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోగా విశాల్ కి కెరీర్ స్టార్టింగ్ లో మంచి క్రేజ్ ఏర్పడినా సరైన సినిమాలు పడకా తెలుగు లో మార్కెట్ ని కోల్పోతూ వచ్చాడు. కానీ ఎట్టకేలకు ఈ ఇయర్ తమిళ్ మరియు తెలుగులో తన మార్కెట్ ని ఓ రేంజ్ లో పెంచుకున్నాడు విశాల్.

అభిమన్యుడు సినిమా తో తెలుగు లో సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు లో కేవలం 4 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 9.2 కోట్ల షేర్ ని అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఆల్ మోస్ట్ పెట్టిన డబ్బుకి డబుల్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ ని సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. తెలుగు లో పూజా సినిమా విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్…5 కోట్ల షేర్ ని ఆ సినిమా సాధించగా ఇప్పుడు ఏకంగా 9.2 కోట్లతో అభిమన్యుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here