అదిరింది మూవీ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా ఫట్టా

    కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ తమిళ్ లో రిలీజ్ అయ్యి దాదాపు 21 రోజుల తర్వాత తెలుగు లో రిలీజ్ అయ్యింది. ప్రతీ వారం సినిమా రిలీజ్ అనుకున్నా సెన్సార్ జాప్యం వల్ల వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు సాయంత్రం 6:30 నుండే ఈస్ట్ కంట్రీస్ లో తెలుగు వర్షన్ భారీగానే రిలీజ్ కాగా అక్కడి నుండి వస్తున్న టాక్ ఎలా ఉందో చూద్దాం పదండీ…

తమిళ్ వర్షన్ కి ఎలాంటి మార్పులు లేకుండా మ్యూట్ డైలాగ్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వర్షన్ చూసిన వాళ్ళు ఫుల్ పైసా వసూల్ అంటున్నారు. విజయ్ మాస్ డైలాగ్స్ తో ఉర్రూతలూగించాడని…. ఫస్ట్ ఆఫ్ విజువల్స్ పరంగాను గ్రాండ్ గా ఉండటం తో పాటు ఫుల్ రేసీగా సాగుతుందని అంటున్నారు.

సెకెండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రొటీన్ గా ఉండటం ఒక్కటే మైనస్ పాయింట్ అని దానికి తోడూ సినిమా లెంత్ కూడా ఎక్కువ(2:50 నిముషాలు) ఉండటం ఒక మైనస్ పాయింట్ అని అంటున్నారు. కానీ సినిమా మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ అని అంటున్నారు.

తెలుగు లో ఈ మధ్య అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ ఏవి రానందున ఈ సినిమా క్లిక్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. టాక్ పాజిటివ్ గానే ఉన్నా ఇంత లెంత్ ఉన్న సినిమాని చూడటం కొద్దిగా కష్టమే అంటున్నారు. కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం అదిరింది అనిపించడం ఖాయమని చెబుతున్నారు…మరి రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment