అజ్ఞాతవాసి కి భారీ షాక్ నైజాంలో (డే 2) భారీ ఎదురుదెబ్బ

0
839

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు భీభత్సాలు సృష్టించినా మిగిలిన ఏరియాలతో పోల్చితే నైజాం మరియు సీడెడ్ ఏరియాలలో అండర్ పెర్ఫార్మ్ చేసింది. కాగా సినిమా కి సోషల్ మీడియాలో భారీ నెగటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అవ్వడం సినిమా మొదటి రోజు వసూళ్ళ పై తీవ్ర ప్రభావం చూపగా రెండో రోజు సినిమా నైజాంలో పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

సుమారు 29 కోట్ల బిజినెస్ ని నైజాంలో సాధించిన ఈ సినిమా మొదటి రోజు మొత్తం మీద 5.45 కోట్ల షేర్ మాత్రమె వసూల్ చేయగా రెండో రోజు ఓపెనింగ్స్ దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నాయి… 5 షో ల అడ్వాంటేజ్….భారీ టికెట్ హైక్స్ ఉన్నా ఫుల్ వర్కింగ్ డే అవ్వడం ఎఫెక్ట్ చూపింది.

మొదటి రోజు తో పోల్చుకుంటే ఓపెనింగ్స్ 60% కి పైగా తగ్గాయని అంటున్నారు. ఇవన్నీ మల్టీప్లేక్స్ కి సంభంచిన ఓపెనింగ్స్ అని సింగిల్ స్క్రీన్స్ లో 70% డ్రాప్స్ కనిపించాయని అంటున్నారు. మరి రోజు ముగిసే సరికి సినిమా ఎంతవరకు తేరుకుంటుందో అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here