అజ్ఞాతవాసి 3rd Day కలెక్షన్స్….ఇది చావుదెబ్బ సామి!!

0
1365

  త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల క్రేజీ కాంబినేషన్ పవర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే…అంతటి క్రేజ్ నడుమ వీరి కలయికలో వచ్చిన మూడో సినిమా అజ్ఞాతవాసి పై నెలకొన్న హైప్ అండ్ అంచనాలు మొదటి రోజు వసూళ్ళ రూపంలో బయటికి వచ్చాయి…చరిత్రలో నిలిచిపోయే కలెక్షన్స్ ని మొదటి రోజు సాధించిన ఈ సినిమా రెండో రోజు నుండే నెగటివ్ టాక్ ఎఫెక్ట్ వలన భారీ ఎదురుదెబ్బ తిందని చెప్పొచ్చు.

మొత్తం మీద రెండు రోజుల్లో 43.5 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం ఆపసోపాలు పడాల్సి వచ్చింది…కొన్ని చోట్ల షోలు కాన్సిల్ అవ్వడం మిగిలిన చోట్ల జై సింహా మరియు గ్యాంగ్ సినిమాల నుండి పోటి అజ్ఞాతవాసి అగమ్యగోచరంగా మార్చింది.

దాంతో సినిమా కలెక్షన్స్ మొత్తం మీద అన్ని ఏరియాలలో కలిపి 3 కోట్ల లోపే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు…కర్ణాటక ఓవర్సీస్ అన్ని కలిపి మరో 15 నుండి 20 లక్షల మధ్యలో షేర్ వచ్చే అవకాశం ఉందని చెబుతుండటంతో సినిమా సంక్రాంతి వీకెండ్ లో ఎంతవరకు కోలుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here