అజ్ఞాతవాసి డే 4 కలెక్షన్స్ అప్ డేట్…చావుదెబ్బ సామి!!

      మొదటి రోజే ఇండస్ట్రీ రికార్డులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి సంచలన కలెక్షన్స్ తో మూడో సారి బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి సంచలనం సృష్టించిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో రోజు నుండి మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాడు. మొదటి రోజు వరకు ఫ్యాన్స్ అందరూ కష్టపడి సినిమాకు నాన్ బాహుబలి రికార్డులు వచ్చేలా చేశారు కానీ రెండో రోజు నుండి సినిమా పరిస్థితి ఏంటో తెలిసిపోయింది.

ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వైపు అడుగులు వేయలేకపోయారు…నిర్మాతల పూర్ పబ్లిసిటీ కావచ్చు సినిమా కి బయట వచ్చిన టాక్ కావచ్చు ఎంత ఫ్యాన్స్ చూసినా కామన్ ఆడియన్స్ మూవీ చూడటానికి ఇష్టపడకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమాను చూసి తెలుసుకోవచ్చు.

సినిమా మొత్తం మీద మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 45.7 కోట్ల వరకు షేర్ ని అందుకోగా నాలుగో రోజు వెంకటేష్ నటించిన క్యామియో ఎపిసోడ్ తో పాటు పాత బోరింగ్ సీన్స్ అన్నీ ట్రిమ్ చేస్తున్నాం అని ప్రకటించి సంక్రాంతి కి కొత్త సీన్స్ వస్తున్నాయి అంటూ కొన్ని పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.

అవి చూసి 4 వ రోజు నుండే అనుకుని మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి వెళ్ళిన ఆడియన్స్ ఆ సీన్స్ లేవని తెలిసి మరింత నిరాశచెందారు…దాంతో కొంచం బెటర్ కలెక్షన్స్ ని రాబడుతుంది అనుకున్నా 4 వ రోజు సినిమా ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్స్ ని సాధి౦చి౦దట.

కాగా మొత్తం మీద 4 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 1.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం…అది కూడా ఫైనల్ కాలేదు అని అంటుండటం టోటల్ ట్రేడ్ విశ్లేషకుల మైండ్ బ్లాంక్ చేస్తుంది…మినిమమ్ 80 కోట్లు కలెక్ట్ చేస్తే యావరేజ్ అయినా అనిపించుకుంటుంది కానీ సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ చూసి అది కూడా కష్టమే అంటున్నారు.

Leave a Comment