అజ్ఞాతవాసి ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా—ఫట్టా

      పవర్ స్టార్ సినిమా ఎదురు చూస్తున్న అభిమానుల ఆఖలి తీర్చుతూ పవర్ స్టార్ పవన్ తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అజ్ఞాతవాసి తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జల్సా అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి… ఇక రెగ్యులర్ షోల కి ముందు ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది ఈ సినిమా..

అక్కడ నుండి వస్తున్న టాక్ యునానిమస్ పాజివిట్ గా ఉందని చెప్పొచ్చు…పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కి ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ పవర్ ఏంటో మరోసారి రుజువు చేసిన ఈ సినిమా అక్కడ ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ఓపెన్ అయ్యి సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది…

సినిమా మొదలు అవ్వడం స్లో గా మొదలు అయినా వన్స్ పవర్ స్టార్ స్క్రీన్ పైకి ఎంటర్ అయ్యాక సినిమా లెవల్ మారిపోతుందని…సీన్ సీన్ కి ఉత్కంట పెరిగిపోతుందని….ఓ భారీ ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు మరింతగా పెంచేస్తుంది అని అంటున్నారు.

ఇక సెకెండ్ ఆఫ్ లో కథ అక్కడక్కడ స్లో అయినా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో గా సినిమాను నిలబెట్టాడు అని అంటున్నారు. పెర్ఫార్మెన్స్ పరంగా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా గా అజ్ఞాతవాసి సినిమా నిలిచిపోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

ఇక హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కొంతవరకు నటనతో మెప్పించగా మరో హీరోయిన్ అను ఎమాన్యుయేల్ లుక్స్ తోనే ఆకట్టుకుందని అంటున్నారు…ఇక మిగిలిన పాత్రలు కొంతవరకు కామెడీ అండ్ స్టొరీ ముందుకు వెళ్ళడానికి వాడుకోగా ఆ పత్రాల పరిమి మేర అందరు చక్కగా నటించారు అని అంటున్నారు.

కానీ ప్రేక్షకులు వచ్చేది మాత్రం పవర్ స్టార్ కోసమే కాబట్టి పవర్ స్టార్ ఎంటర్ అయ్యాక చివరి వరకు సినిమాను తానె మోసి నటనతో, యాక్షన్ తో, సాంగ్ పాడి ఇలా అన్నీ తానై నడిపించి మెప్పించాడని అంటున్నారు..ఇక అనిరుద్ సంగీతం ఓకే అనిపించినా బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు అని అంటున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం కథ పరంగా కొంతవరకు హాలీవుడ్ మూవీ “లార్గో వించ్” ని ఇన్స్పైర్ అయినా తనదైన స్టైల్ లో కథని డీల్ చేసి మెప్పించి…తన మాటలతో మాయ చేసి అభిమానులు పవన్ నుండి ఎం కోరుకుంటున్నారో అవన్నీ సినిమాలో పెట్టాడని అంటున్నారు…ఓవరాల్ గా ప్రీమియర్ అండ్ స్పెషల్ షోల నుండి సినిమా సూపర్ టాక్ ని తెచ్చుకుంది…ఇప్పుడు రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉందో చూడాలి.

Leave a Comment