అజ్ఞాతవాసి మూవీ రివ్యూ…పవర్ స్టార్ పవర్(ఊహాతీతం)…సెన్సేషనల్ బ్లాక్ బస్టర్

      2017 లో కాటమరాయుడు లాంటి యావరేజ్ సినిమాతోనే ఓపెనింగ్స్ లో ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నికార్సయిన కాంబినేషన్ తో కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు… త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న మూడో సినిమా అవ్వడం తో అజ్ఞాతవాసి పై ఆల్ టైం హ్యుమంగస్ అంచనాలు ఏర్పడగా ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా రిలీజ్ అయ్యింది…

ఇక సినిమా ఎలా ఉంది అంటే….వేల కోట్ల ఆస్తి ఉన్న ఒక వ్యాపారి కొడుకు తన తండ్రి ఆస్తి ప్రమాదంలో ఉంటె ఎలా ఆ శిఖరమంత సామ్రాజ్యం కూలకుండా కాపాడాడు అనేది సినిమా కథ…అత్తారింటికి దారేది సినిమాలో లక్ష కోట్ల ఆస్తి ఉన్న పాత్ర కి కొంత కొనసాగింపుగా సినిమా అనిపించినా…

సినిమాలో అనేక కోణాలు ఉండటం…ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు అన్ని పాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన సినిమా లో ఉండేలా చూసుకుకోవడం అజ్ఞాతవాసి ని మరో త్రివిక్రమ్ సెల్యూలాయిడ్ గా అలరించింది…దానికి పవర్ స్టార్ హ్యుమంగస్ క్రేజ్ కూడా తోడు అవ్వడం సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్ళింది..

నటన పరంగా మరోసారి పవర్ స్టార్ అభిమానులు తన నుండి ఖుషీ నుండి జల్సా వరకు ఏమేమి కోరుకున్నారో అన్నీ ఒక్కొటిగా ఉండేలా చూసుకుని 25 వ సినిమా ఎలా ఉండాలో అలాంటి కథ తో వచ్చాడు…కానీ సినిమా మరీ మాస్ మూవీస్ ఇష్టపడే వారికి కొంతవరకే నచ్చుతుంది…

కానీ మెజారిటీ ఆడియన్స్, పవన్ ని ఇష్టపడేవాళ్ళు, త్రివిక్రమ్ సినిమాలు అంటే ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది… హీరోయిన్స్ తమ తమ పాత్రల్లో ఆకట్టుకోగా ఖుష్బు మాత్రం తనదైన ముద్ర వేసే నటనతో సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ ని ఇచ్చింది.

మిగిలిన పాత్రలు అన్ని తమ పరిది మేరలో నటించి మెప్పించాగా అనిరుద్ అందించిన సంగీతం సో సో గానే ఉన్నా క్లాస్ టచ్ ఎక్కువగా ఉండటం పవన్ కోర్ మాస్ ఫ్యాన్స్ కి పెద్దగా ఎక్కలేదు…కానీ పవన్ పాడిన సాంగ్ వాళ్ళకి వీనులవిందుగా అనిపిస్తుంది అని చెప్పొచ్చు.

ఓవరాల్ గా పెర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ గా అజ్ఞాతవాసి సినిమాను చెప్పొచ్చు…పండగ సమయంలో ఆ ఫీల్ ని కలుగజేసే పల్లెటూరి అనుభవాలు పెద్దగా లేకున్నా పండగ సమయంలో ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే పెద్ద హీరో సినిమాకు ఉండాల్సిన అన్ని లక్షణాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను అందుకుని 125 కోట్ల టార్గెట్ ని అందుకుంటుందో చూడాలి…అందుకునే సత్తా సినిమాలో ఉంది…దానికి 7 రోజుల లాంగ్ వీక్…నైజాంలో 5 షోలు…ఆంద్రప్రదేశ్ లో అన్ లిమిటెడ్ షోలు….టికెట్ హైక్స్ ఇలా అన్ని కలిసి వస్తున్నాయి కాబట్టి కొట్ట చరిత్ర సృష్టించే అవకాశం సినిమాకు పుష్కలంగా ఉంది…

1 Comment

Leave a Comment