అజ్ఞాతవాసి మూవీ సెన్సార్ రివ్యూ…టాక్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడానికి మరి కొన్ని రోజులు మాత్రమె ఉంది… కాగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకున్న సినిమా యు/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకోగా సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది…పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్ని తన భుజాన మోశాడు అంటూ చెబుతున్నారు.

సినిమా మొదటి అర్ధభాగంతో పోల్చితే సెకెండ్ ఆఫ్ అద్బుతంగా ఉందని అంటున్నారు. ఫస్టాఫ్ కథ కొంచం స్లో గా మొదలు అవ్వగా ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా లెవల్ ఒక్కసారిగా మారిపోతుంది అంటూ చెబుతుండటం విశేషం. పవన్ రోల్ కి సినిమాలో చాలా వెయిట్ ఉందని అంటున్నారు.

ఇక ఒకప్పటి హీరోయిన్ ఖుష్బు పవన్ కి అమ్మ న లేక అక్కనా అన్న విషయం మాత్రం సినిమాలో చూసే తెలుసుకోవాలని అంటున్నారు. సెకెండ్ ఆఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి విందు భోజనం అని అంటుండటం విశేషం. ఓవరాల్ గా సెన్సార్ వారు ప్రతీ పెద్ద సినిమాను చెప్పినట్లే అజ్ఞాతవాసి కి కూడా మంచి టాక్ చెబుతున్నారు. సినిమా ఇదే రేంజ్ లో ఉంటె కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయం.

Leave a Comment