అజ్ఞాతవాసి దెబ్బతో కుదేలయిన త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా??

0
1110

  ప్రత్యక్ష రాజ‌కీయాల్లో కి వెళ్లాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ కు ‘అజ్ఞాతవాసి’ తో ఓ భారీ విజయాన్ని ఇవ్వాలని చాలా గట్టి గా కృషి చేసి విఫలమైన త్రివిక్రమ్, ప్రస్తుతం నిరాశ లో కూరుకుపోగా ఎన్టీఆర్ ఫోన్ చేసి ఓదార్చారట. టాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు, త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలుస్తోంది. త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తోనేనన్న సంగతి తెలి సిందే. 

ఈ నేపథ్యంలో మరింత నిరాశలోకి త్రివిక్రమ్ వెళ్లకుండా, ఫోన్ చేసిన ఎన్టీఆర్, జయాపజయాలు చాలా కామన్ అని, ఫెయిల్యూర్ గురించి పట్టించుకోవద్దని అనునయించాడట. మన సినిమాపై దృష్టి పెట్టాలని, అది కచ్చితంగా హిట్ అవుతుందని, తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కవచ్చని చెప్పాడట.

ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ వచ్చే నెల 14 న మొదలు కాబోతున్నట్లు సమాచారం…ఈ సినిమాతో త్రివిక్రమ్ కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వరుసగా 5 వ విజయం కూడా ఇవ్వడం ఖాయం అన్న నమ్మకం అందరిలోనూ ఉందని యూనిట్ వర్గాలు చెబుతుండటం విశేషం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here