నా సినిమా కాపీనే….అజ్ఞాతవాసి పై “లార్గో వించ్” డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  త్రివిక్రమ్ శ్రీనివాస్ ల తాజా సినిమా ‘అజ్ఞాతవాసి’ తన సినిమాకు కాపీయేనని ఫ్రెంచ్ చిత్రం ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సాలీ వ్యాఖ్యానించారు. గత రాత్రి లీ బ్రాడీలోని మెట్రో 4 థియేటర్ లో 7.45 గంటల షోను చూసిన ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తాను సినిమాను చూశానని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు.
ఈ సినిమా తనకు కూడా నచ్చిందని చెబుతూనే….

  దురదృష్టవశాత్తూ ఈ సినిమా కథ, తన చిత్ర కథకు చాలా దగ్గరగా ఉందని చెప్పారు. కాగా, ఈ చిత్రం ‘లార్గో వించ్’ చిత్రానికి కాపీ అని గతంలోనే కత్తి మహేష్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథపై తమకు స్పష్టత ఇవ్వాలని ‘లార్గో వించ్’ భారత హక్కులను సొంతం చేసుకున్న టీ-సిరీస్ నుంచి ‘అజ్ఞాతవాసి’ నిర్మాతలకు నోటీసులు కూడా అందాయి.

ఇక జెరోమ్ సాలీ ట్వీట్ ను చూసిన వారు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ఓపెన్ అయ్యి సంచలనం సృష్టించింది…మొదటి రోజు వసూళ్ళ భీభత్సం ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment