అఖిల్ హలో ఫస్ట్ రివ్యూ…హిట్టా–ఫట్టా!

      అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన మొదటి సినిమా అఖిల్ అనుకున్న రేంజ్ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిలించిన విషయం తెలిసిందే… దాంతో దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని చేసిన సినిమా హలో…. ఇష్క్, మనం అండ్ 24 లాంటి అద్బుతమైన సినిమాలు తీసిన విక్రం కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా నేడు భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ నుండి టాక్ కూడా వచ్చేసింది.

అక్కడ భారీ గా ప్రమోషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకి అక్కడ నుండి విశేష స్పందన లభిస్తుంది….కథ పరంగా సింగిల్ లైన్ స్టొరీ నే అయినా తెరకెక్కిన విధానం మాత్రం అబ్బుర పరిచింది అని అంటుండటం విశేషం… అఖిల్ మొదటి సినిమా కన్నా రెండో సినిమాలో నటనలో మరిన్ని మెట్లు ఎక్కాడు అంటున్నారు.

విక్రం కుమార్ కథ కి పెర్ఫెక్ట్ గా సూట్ అయిన అఖిల్ సినిమాకు 100% న్యాయం చేశాడని అంటున్నారు. డాన్సులు, ఫైట్స్ విషయంలో తన మార్క్ ని చూయిస్తూ ఇప్పుడున్న హీరోల కి తానూ ఏమాత్రం తీసిపోనని నిరూపించుకున్నాడని అంటున్నారు.

ఇక హీరోయిన్ కూడా మొదటి సినిమానే అయినా ఆకట్టుకుందని అంటున్నారు. జగపతి బాబు మరియు రమ్యకృష్ణ లు తమ తమ రోల్స్ లో ఆకట్టుకోగా ఎడిటింగ్ అండ్ విజువల్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండటం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.

ఇక అందరి కన్నా ఎక్కువ మార్కులు 50 సినిమాలకు సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి గాను సొంతం చేసుకున్నాడని అంటున్నారు. పాటలు వినడానికి చూడటానికి కూడా అద్బుతంగా అనిపించాయని అంటున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్బుతంగా ఉందని అంటున్నారు.

విలన్ అజయ్ ఎప్పటి లానే విక్రం కుమార్ సినిమాల్లో ఎలా మెప్పిస్తాడో ఈ సారి కూడా అలాగే మెప్పించాడని అంటున్నారు. విక్రం కుమార్ చిన్న కథని ఎంత బాగాలో చెప్పాలో అంత బాగా చెప్పి ఫుల్ మార్కులు కొట్టేశాడని అంటున్నారు. మొత్తం మీద సినిమాకు ఓవర్సీస్ నుండి యునానిమస్ టాక్…

లభించినట్లే నని అంటున్నారు. ఇక రెగ్యులర్ షోల నుండి కూడా ఇదే టాక్ ని సొంతం చేసుకుంటే అఖిల్ కి నికార్సయిన హిట్ తన ఖాతాలో పడినట్లే అవుతుందని అంతా భావిస్తున్నారు…మరి అఖిల్ హలో కి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి టాక్ లభించిందో ఒకటి రెండు గంటల్లో అసలు టాక్ బయటికి రానుంది…

Leave a Comment