అఖిల్ హలో మూవీ రివ్యూ…సూటిగా సుత్తి లేకుండా….హిట్ కొట్టాడా లేదా!!

       మొదటి సినిమా అఖిల్ రిజల్ట్ అందరు మరిచిపోయిన తర్వాత అఖిల్ అక్కినేని మనం లాంటి క్లాసిక్ ని అక్కినేని ఫ్యామిలీ కి అందించిన విక్రం కుమార్ డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ హలో తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల నడుమ ఈ రోజు రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది… మరి ఇక్కడ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

చిన్న వయసులో దూరం అయిన హీరో మరియు హీరోయిన్స్ కొన్ని ఏళ్ల తర్వాత తిరిగి కలుద్దాం అని ఒకరి నుండి ఒకరు మాట తీసుకుని విడిపోతారు. హీరోయిన్ వెళ్ళే సమయం లో హీరో కి ఫోన్ చేస్తానని చెబుతుంది…ఆ ఫోన్ కాల్ కోసం చిన్నప్పటి నుండి హీరో ఎదురు చూస్తూ ఉంటాడు.

కొన్నేళ్ళ తర్వాత ఫోన్ కాల్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఎలాంటివి, హీరో హీరోయిన్స్ తిరిగి ఎలా ఏకం అయ్యారు అనేది సినిమా కథ… చాలా సింపుల్ కథని డైరెక్టర్ అద్బుతంగా డీల్ చేసి సినిమాను సేఫ్ జోన్ లో చేరేలా చేశాడు. దానికి అఖిల్ కూడా తన సామర్థ్యం మొత్తం వాడాడు.

స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగిన సినిమాకి విక్రం కుమార్ ఒక పిల్లర్ అయితే అఖిల్ రెండో పిల్లర్, ఇక మూడో పిల్లర్ అనూప్ రూబెన్స్ సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్…ఇక ఇలాంటి సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిర్మించిన నాలుగో పిల్లర్ నాగార్జున..

సినిమాలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి కానీ వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు…హీరో ఎంట్రీ కి సమయం తీసుకోవడం…ఫస్టాఫ్ లో హీరో కనిపించే స్క్రీన్ లెంత్ తక్కువగా ఉండటం…సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అవ్వడం చిన్న చిన్న మైనస్ పాయింట్స్.

కానీ టోటల్ సినిమా పరంగా చూసుకుంటే అఖిల్ హలో అంచనాలను అందుకునే సినిమా….అఖిల్ కి రీ లాంచింగ్ లాంటి సినిమా అని చెప్పొచ్చు. ఈ క్రిస్టమస్ లాంగ్ వీకెండ్ లో అఖిల్ హలో కలెక్షన్స్ భారీగానే దండుకునే అవకాశం ఉంది…సినిమా టాక్ బాగుంది కాబట్టి……

కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టాల్సిన అవసరం ఉంది….సినిమా బిజినెస్ 32 కోట్లు అవ్వడం క్లీన్ హిట్ 33 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండటంతో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని స్టడీగా సాధిస్తూ పోటి ని తట్టుకుని నిలుస్తుంది అనే దానిపై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

Leave a Comment